suspend | ఎస్పీపై స‌స్పెన్ష‌న్ వేటు

suspend | ఎస్పీపై స‌స్పెన్ష‌న్ వేటు

suspend | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : కర్ణాటక (Karnataka) లోని బళ్లారి నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటు వివాదం ఘర్షణకు దారితీసి కాల్పులతో రణరంగంగా మారిన సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విధి నిర్వహణలో వైఫల్యం చెందారన్న ఆరోపణల నేపథ్యంలో బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ (SP Pawan Nijjur)‌ పై సస్పెన్షన్ వేటు వేసింది.

బళ్లారి (Bellary) నగరంలో రెండు వర్గాల మధ్య ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటు విషయంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ కాల్పులకు దారితీసి ఓ యువకుడు మరణించాడు. ఈ సంఘటనపై ప్రభుత్వం దృష్టి సారించి విచారణ చేపట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం (neglect) వహించారన్న ఆరోపణలతో ఎస్పీ పవన్ నిజ్జూర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతలను కాపాడటంలో ఉన్నతాధికారులకు సరైన సమాచారం చేరవేయడంలో ఆయన విఫలమయ్యారని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి స్థాయి విచారణ జరుగుతోంది. బళ్లారి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు తెలిపారు.

Leave a Reply