Rs.750 Wages | 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
Rs.750 Wages | 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
- రాష్ట్రాల వారిగా పంటల ప్రణాళికలు అమలు చేయాలి
- రాష్ట్ర రైతుసంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ
Rs.750 Wages | హుజూర్‌నగ ఆంధ్రప్రభ : కార్మిక రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, కార్పొరేట్ సంస్థల విధానాలకు అనుకూలంగా ఉన్న 4 లేబర్ కోడ్ లను తక్షణమే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రద్దు చేయాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ(Pashya Padma) అన్నారు.
హుజూర్‌నగర్ పట్టణంలో ఈ రోజు జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా(Samyukta Kisan Morcha) సమావేశంలో మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 4 లేబర్ కోడ్‌ల(4 Labor Codes)ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఆలిండియా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకం కింద 200 రోజుల పనిదినాలు కల్పించాలని, రోజుకు రూ.750ల కూలీ(Rs.750 Wages) ఇవ్వాలన్నారు.
ఉపాధి హామీ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు ప్రోత్సహించేలా ప్రణాళికలు అమలు చేయాలని కోరారు. రాష్ట్రాల వారీగా పంటల బీమా పథకం అమలు చేయాలని, సబ్సిడీ(Subsidy)పై రైతులకు ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం కూనీ అయ్యేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని తక్షణమే కార్మిక రైతులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలు రద్దు చేయాలని లేని ఎడల దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ఆమె హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు కంబాల శ్రీనివాస్, కొప్పోజు సూర్యనారాయణ, పల్లా వెంకటరెడ్డి దుగ్గి బ్రహ్మం, ధూళిపాళ ధనుంజయ నాయుడు, గుండు వెంకటేశ్వర్లు, దేవరం మల్లీశ్వరి, పాశం వెంకటనారాయణ, నూకల చంద్రం జక్కుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
