Software Engineer | సహజీవనం చేస్తున్న యువతి సైతం

Software Engineer | సహజీవనం చేస్తున్న యువతి సైతం
Software Engineer | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బెంగళూరులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సహజీవనం చేస్తున్న టెకీ జంట ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒకేరోజు సహజీవనం చేస్తున్న జంట ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బాబురెడ్డి (31) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
అతని మరణం తెలిసిన అనంతరం, అతనితో కలిసి నివసిస్తున్న యువతి (31) తీవ్ర మనస్తాపానికి గురై అదే భవనంలోని 17వ అంతస్తు పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దుర్ఘటనకు గల కారణాలు ఏమిటన్నది విచారణలో వెలుగులోకి రావాల్సి ఉంది.
