పీఓకేలో సైన్యం దాష్టీకం.. ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు
పీఓకేలో సైన్యం దాష్టీకం.. ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు
- పీఓకే ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు కలకలం
- ప్రజలపై లాఠీచార్జీ, కాల్పుల ఆరోపణలు
- అవామీ యాక్షన్ కమిటీ తీవ్ర విమర్శలు
- మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ జోక్యం కోరిన నాయకులు
- ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియ
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో పరిస్థితులు ఆందోళనకరంగా పరి ణమిస్తున్నాయి. ఓవైపు స్వతంత్ర ప్రతిపత్తి, స్వేచ్ఛావాయువుల కోసం ఎంతోకాలంగా స్థానిక ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఇలాంటి ఆందోళ నలను సైనిక చర్యతో ఎప్పటికప్పుడు పాక్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణ చివేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో పీఓకే అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేం దుకు పాక్ సర్కార్ ప్రయత్నిస్తోంది. మూడు దశల పోలింగ్ ప్రక్రియలో తొలి దశ పూర్తయింది. ఈ క్రమంలో అక్కడ చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, కాల్పులు చర్చనీయాంశం అయ్యాయి. ఎన్నికలు ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించాల్సిన వేదికగా ఉండాలే కానీ, ఘర్షణలు, భద్రతా బలగాల జోక్యం, రాజకీయ ఉద్రిక్తలు పీవోకేలో ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ప్రజలను అణచిపెట్టి, ఎన్నికల కేంద్రాలకు రానివ్వకుండా ఆటంకాలు సృష్టించిన సైనికులు ధైర్యంగా ఎదిరించి ముందుకు వచ్చిన వారిపై లాఠీ చార్జీ జరిపి, కాల్పులు జరిపినట్టు వార్తలు వచ్చాయి. ప్రభుత్వమే ఈ తతం గాన్ని జరిపించిందన్న ఆరోపణలు వచ్చాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన లాంగ్ మార్చ్ హింసాత్మకంగా పరిణమించింది. ఈ హింసలో 20 మంది పైగా మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ లాంగ్ మార్చ్క యునైటెడ్ కాశ్మీర్ యునైటెడ్ పార్టీ పిలుపు ఇచ్చింది. ప్రభుత్వం పూర్తిగా సైన్యం అదుపాజ్ఞలలో పని చేస్తోందని, పోలీసుల పాత్ర ఏమీ లేదని జాయంట్ అవామీ యాక్షన్ కమిటీ ఆరోపించింది. ఈ హింసా కాండకు అధికారంలో ఉన్న, ప్రధాని షహబాజ్ షరీఫ్ బాధ్యత వహించా లని కూడా ఆ కమిటీ ఆరోపించింది. ఈ హింసాకాండపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకోవాలని, బాధ్యులపై చర్య తీసుకో వాలని డిమాండ్ చేసింది.
ఈ లాంగ్ మార్చ్ బృందాలు మీర్పూర్లో బయలుదేరాయి. నిన్న ముజాఫరాబాద్ మీదుగా సాగాయి. ఆక్రమిత కాశ్మీ ర్లో గడిచిన కొంత కాలంగా ఆందోళనలు సాగుతున్నాయి. తమ ప్రాం తంలో పౌర హక్కులు పూర్తిగా హరించాయనీ, ప్రభుత్వం పౌర హక్కుల నాయకులను అణచివేస్తోందని అవామీ యాక్షన్ కమిటీ ఆరోపించింది. ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఎన్నికల హింస జరగడం ఇది మొదటిసారి కాదు. అక్కడ పౌరుల ఓట్లు గల్లంతు అయ్యాయి. ప్రజలను రాజకీయ పార్టీ ల నాయకులు హింసిస్తున్నారు. ఎన్నికల ముందు జరిగిన దౌర్జన్యాల్లో పలువురు మరణించారు. అందుకే, ఈ ఎన్నికల తతంగాన్ని బహిష్కరించాలని ప్రతిపక్షాలు పిలుపు ఇచ్చాయి.
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మొత్తం 53 స్థానాలు ఉన్నాయి. వీటిలో 43 సీట్లకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తు న్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఆగస్టు 10వ తేదీన చివరి రోజు పోలింగ్ జరగనుంది. షా నవాజ్ నేతృత్వంలోని పీఎంఎల్ 9 స్థానాలు గెల్చుకుంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 4 సీట్లు మాత్రమే గెల్చుకుంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ ఈ ఎన్ని కలను బహిష్కరించింది.
పీవోకే వంటి సున్నిత ప్రాంతాలలో భద్రతా వ్య వస్థ పాత్ర ఎప్పుడూ కీలకమే. అయితే ఎన్నికల సమయంలో సైన్యం లేదా భద్రత బలగాల చర్యలు పారదర్శకంగా ఉండాలి. ప్రజల భద్రతను కాపా డటం, రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేయకుండా చూడటం మధ్య సమతుల్యత ఎంతైనా అవసరం.
