CM Revanth | మత్స్యకారులకు పెద్దపీట…

CM Revanth | మత్స్యకారులకు పెద్దపీట…

CM Revanth | తొర్రూరు, ఆంధ్రప్రభ : మత్స్యకారుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేసిందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి(MLA Mamidala Yashaswini Reddy) అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం పెద్ద చెరువులో మత్స్యశాఖ 100 రాయితీతో ఉచిత చేప పిల్లలను ఈ రోజు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి(Hanumandla Jhansi Rajender Reddy), మత్స్యశాఖ అధికారులతో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గంగపుత్రుల ఆర్థిక అభివృద్ధియే ధ్యేయంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేప పిల్లలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అన్ని కుల వృత్తుల అభివృద్ధికి సీఎం రేవంత్ రేడ్డి(CM Revanth Reddy) కృషి చేస్తున్నారని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలోని చెరువులలో చేప పిల్లలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చేపల ఉత్పత్తి గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ముదిరాజుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి జనగాం శివప్రసాద్,కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ముత్తినేని సోమేశ్వరరావు, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, చీఫ్ ప్రమోటర్ కొత్తూరు రమేష్, ఎంపీడీవో కూస వెంకటేశ్వర్లు, ఏఎంసీ డైరెక్టర్లు కందాడి అచ్చిరెడ్డి, కంచర్ల వెంకటాచారి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యా నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, మహబూబ్ రెడ్డి, ముద్దం విక్రం రెడ్డి, జూలూరు జగన్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.