దిల్దార్‌నగర్‌లో కొత్త డీటీఆర్ ఏర్పాటు
ఓవర్‌లోడ్ విద్యుత్ సమస్యకు పరిష్కారం
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని దిల్దార్‌నగర్ గ్రామంలో గత కొన్ని నెలలుగా ఓవర్‌లోడ్ కారణంగా నెలకొన్న విద్యుత్ సమస్యకు పరిష్కారంగా కొత్త 25 కేవీ డీటీఆర్‌ను ఏర్పాటు చేశారు.
గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యను కడెం విద్యుత్ శాఖ ఏఈ ఎం. రామ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లగా, గ్రామానికి కొత్త 25 కేవీ డీటీఆర్‌ను మంజూరు చేశారు. శనివారం విద్యుత్ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ బద్దనపల్లి స్టీఫెన్ డీటీఆర్‌ను ఏర్పాటు చేయించారు.
ఈ సందర్భంగా గ్రామానికి కొత్త డీటీఆర్‌ను మంజూరు చేసిన విద్యుత్ శాఖ ఏఈ ఎం. రామ్‌సింగ్‌కు సర్పంచ్ బద్దనపల్లి స్టీఫెన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆనంద్ గౌడ్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
