పంటల మార్పిడితో అధిక దిగుబడులు

పంటల మార్పిడితో అధిక దిగుబడులు
- శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కార్యక్రమం
కుంటాల, ఆంధ్రప్రభ : రైతుల ముంగిట్లోకి శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.సోమవారం కుంటాల మండలంలోని లింబ కె గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ బి రామ్ రెడ్డి డాక్టర్ టి నాగేంద్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు చెప్పిన మెలకువలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని కోరారు. భూమి రకాన్ని బట్టి సరైన విత్తనాల ఎంపిక,వాటికి తగిన ఎరువుల వినియోగంపై రైతులకు వివరించారు.
ఒకే విధమైన పంటను వరుసగా వేయకుండా పంట మార్పిడి పాటించాలని సూచించారు.పంట దిగుబడి పెంచేందుకు మోతాదుకు మించి ఎరువులు వాడకుండా,తక్కువ ఎరువులతో మంచి దిగుబడి సాధించే పద్ధతులను వివరించారు.మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలను సాగు చేసి,అధిక ఆదాయం వచ్చే పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడులు సాధించాలని పేర్కొన్నారు.
లాభదాయకమైన పంటలను పెట్టాలని పేర్కొన్నారు పప్పు ధాన్యాలు చిరుధాన్యాల పంటలను సాగు చేసుకోవాలని సూచించారు పొద్దు తిరుగుడు కంది మినుము పెసర పంటలతో పాటు పంటల మార్పిడి మూలంగా మంచి దిగుబడి లభిస్తాయని రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని రైతులకు వివరంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గీత మహేందర్ మండల వ్యవసాయ అధికారి విక్రమ్ మాజీ ఆత్మ చైర్మన్ అశోక్ రెడ్డి ఆత్మ డైరెక్టర్ గంగాధర్ ఏఈఓ శ్రీనివాస్ స్థానిక నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
