బాసర, నిర్మల్ జిల్లా, స్మార్ట్ ఆంధ్రప్రభ : నిర్మల్ (Nirmal) జిల్లా బాసర (Basara), మహబూబ్ నగర్, ఆర్జీయూకేటీ (RGUKT) కి దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. దరఖాస్తులు మొదలైన నాటి నుండి నేటి వరకు పది రోజుల్లో పది వేలకు పైగా దరఖాస్తులు (Applications) వచ్చినట్లు యూనివర్సిటీ ఇంచార్జ్ వైస్ ఛాన్స్లర్ ఏ.గోవర్ధన్ సోషల్ మీడియా వేదిక ద్వారా తెలిపారు.
గతంలో కంటే ఈసారి దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని యూనివర్సిటీ (University) అధికారులు భావిస్తున్నారు. బాసర ఆర్జీయూకేటి లో 1500, మహబూబ్ నగర్ ఆర్జియూకేటీలో 180 సీట్లకు యూనివర్సిటీ దరఖాస్తులను స్వీకరిస్తుంది. మరో 12 రోజులు గడువు ఉండడంతో ఈ సంఖ్య మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉందని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.