సీతమ్మకు ఆషాడమాస సారే సమర్పణ..
ఘంటసాల, ఆంధ్రప్రభ : ఆషాడమాసం సందర్భంగా ఘంటసాలలో సత్రం సెంటర్ దగ్గర గల రజకుల రామాలయం నందు సీతమ్మ వారికి ఆషాడ మాస సారి శ్రీరామలయం సభ్యులందరూ సమర్పించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి వస్త్రాలు, ఆషాడ మాస సారి భక్తులు సమర్పించారు. అదేవిధంగా పెన్నేరమ్మ తల్లి దేవస్థానం, ముత్యాలమ్మ తల్లి దేవస్థానం, శ్రీ బాల పార్వతీ సమేత జగదీశ్వర్ ఆలయం, భావన రుషి ఆలయం నీ సందర్శించి అందరు అమ్మవారికి ఆషాడమా సారి అందించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామాలయం కమిటీ అధ్యక్షురాలు ఆదివారం దుర్గ భవాని, పోతర్లంక వెంకటేశ్వరరావు, ఆదిరాల రాముడు, పోతార్లంక శ్రీనివాసరావు, తూములూరి సుబ్రహ్మణ్యం, కనుమూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
