అమ్మవారి ధ్వజస్తంభ ప్రతిష్టాపన..

అమ్మవారి ధ్వజస్తంభ ప్రతిష్టాపన..

పాయకాపురం, ఆంధ్రప్రభ : కండ్రికలోని శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లికార్జున స్వామి దేవస్థానంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని అమ్మవారికిపూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా కొబ్బరికాయ కొట్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, నవధాన్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాకుండా సమాజంలో సానుకూల శక్తిని పెంపొందించే కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు.

ఇలాంటి పవిత్ర కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా సామాజిక ఐక్యతకు కూడా దోహదపడతాయని పేర్కొన్నారు.దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధి కోసం అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమాను నేతలు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కె హర్ష సాయి, ప్రధాన కార్యదర్శి ఎస్ కె బాబు, యూనిట్ ఇన్చార్జి కోమరి రాజేష్, నల్లి పోగు కన్నా, పరిమి వెంకట్, పరిమి అజయ్ , తోటకూర రమేష్ బాబు,తిరుపతిరావు, రమణ,పుప్పాల భాను, పుప్పాల శివ,ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply