వర్షాలకు దెబ్బతిన్న రహదారి..

ఇరుక్కుపోయిన బొలెరో వాహనం

పెంచికల్‌పేట్, ఆంధ్రప్రభ : మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొంది. మండలంలోని కొండపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లగూడకు వెళ్లే రహదారిపై వంతెన లేకపోవడంతో బొలెరో వాహనం బురదలో ఇరుక్కుపోయింది.

సమాచారం అందుకున్న గ్రామస్థులు జేసీబీ సహాయంతో వాహనాన్ని బయటికి తీశారు. దీంతో గొల్లగూడ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే రహదారికి మరమ్మత్తులు చేపట్టి, శాశ్వతంగా వంతెన నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. అప్పుడే ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని వారు పేర్కొన్నారు.