మహిళల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..
కడెం, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం మహిళల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని నర్సాపూర్ గ్రామ సర్పంచ్ డీఎస్ సంగీత రాజేష్ లు అన్నారు. సోమవారం కడెం మండలంలోని నర్సాపూర్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న ఐకేపీ వీఓ మహిళా శక్తి భవన నిర్మాణం పనులను నర్సాపూర్ గ్రామ సర్పంచ్ డీఎస్ సంగీత రాజేష్ లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఇందిరమ్మ పథకం ఇండ్లు వడ్డీ లేని రుణాలు ఉచితంగా బస్సు ప్రయాణం లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ జంగం రమేష్, స్థానిక పంచాయతీ కార్యదర్శి నరేష్ ఐకేపీసీసీ విష్ణువర్ధన్, కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు టి మల్లేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రెంకల శ్రీనివాస్ యాదవ్, జీపీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, డ్వాక్రా గ్రూప్ మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
