Gold Rate | అదిరే శుభవార్త..

Gold Rate | అదిరే శుభవార్త..
Gold Rate | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ఈ రోజు గోల్డ్ రేటు తగ్గింది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గోల్డ్ రేటులో మార్పులు చోటు చేసుకున్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజు రోజుకు ముదురుతున్నాయి. యుద్దం ఆగే సూచనలు కనిపించడం లేదు. ఓ వైపు చర్చలు నడుస్తున్నా మరోవైపు యుద్ధ జ్వాలలు రేగుతూనే ఉన్నాయి. దీని ప్రభావం పసిడి ధరల మీద పడుతోంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. హార్ముజ్ జలసంధిని తెరిచినట్లు తెరిచి మళ్లీ మూసివేసింది ఇరాన్. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆ ప్రభావం బంగారం ధరలపై పడింది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో పసిడి ధరలు ఈరోజు భారీగానే తగ్గాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 20వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎంత మేర తగ్గాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ధరలు తగ్గడం భారీ ఊరటగా చెప్పవచ్చు. ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 450 మేర తగ్గింది. దీంతో తులం గోల్డ్ రేటు రూ. 1,42,350 వద్దకు తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ. 490 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ. 1,55,290 వద్ద అమ్ముడవుతోంది.
ఈరోజు వెండి రేట్లలో ఏ మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు ఎలాంటి మార్పు లేకుండా రూ. 2,80,000 మార్క్ వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న క్రమంలో బంగారం, వెండి రేట్లలో మళ్లీ పెరుగుదల ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
