Middle East Talks | లెబనాన్‌పై దాడులే కారణం…

Middle East Talks | లెబనాన్‌పై దాడులే కారణం…

Middle East Talks | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ విరమణ, ప్రాంతీయ ఉద్రిక్తతల నివారణకు జరగాల్సిన కీలక చర్చలు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని స్విట్జర్లాండ్ అధికారికంగా ప్రకటించింది.

ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం తర్వాత పరిస్థితులు చక్కబడతాయని భావించినప్పటికీ, కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య ఘర్షణలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో 16 మంది మృతి చెందినట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ చర్చలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. లెబనాన్‌పై దాడులు పూర్తిగా నిలిపివేస్తామనే హామీ ఇచ్చిన తర్వాతే చర్చలను పునఃప్రారంభించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో శాంతి చర్చల భవితవ్యంపై అనిశ్చితి ఏర్పడింది. చర్చలను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.