TPCC Chief | వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

TPCC Chief | వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
TPCC Chief | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ వివిధ కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లను ప్రకటించారు.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్‌గా బస్వరాజ్ శ్రీనివాస్, వాషర్‌మెన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దాసరిరాజు అజయ్ కుమార్, గీతకార్మికుల కార్పొరేషన్ ఛైర్మన్‌గా మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్‌ను నియమించారు. అలాగే పెరిక సహకార కార్పొరేషన్ ఛైర్మన్‌గా దొంగారి వెంకటేశ్వర్లు, మేర సహకార కార్పొరేషన్ ఛైర్మన్‌గా సంగా వెంకటరాజం నియామకం పొందారు. ఈ నియామకాలతో వివిధ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
