సోషల్ మీడియాతో జాగ్రత్త..
- అజిత్ సింగ్ నగర్ సీఐ చంద్రశేఖర్
పాయకాపురం, ఆంధ్రప్రభ: అజిత్ సింగ్ నగర్ యం. కే బేగ్ మున్సిపల్ హైస్కూల్లో అజిత్ సింగ్ నగర్ పోలీసులు విద్యార్థులకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అజిత్ సింగ్ నగర్ సీఐ చంద్రశేఖర్ పాల్గొని నేటి బాలబాలికలే రేపటి పౌరులని, విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తు కోసం చదువుపైనే పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు.
సోషల్ మీడియాను అనవసరమైన విషయాలకు వాడుతూ సమయాన్ని వృధా చేసుకోవద్దని ఆయన హెచ్చరించారు. విజయవాడ సింగ్‌నగర్‌లోని ఎంకే బేగ్ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు సబ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, స్కూల్ హెడ్ మాస్టర్ హుస్సేన్, పాఠశాల సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
