ఘంటసాలలో ప్రజా దర్బార్..
ఘంటసాలలో ప్రజా దర్బార్..
ఘంటసాల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం రేపు ఉదయం 10:30 ఘంటసాలలో ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ డీ.సుబ్బారావు తెలిపారు. ఘంటసాల మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరుకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు విచ్చేసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఆయా సమస్యలను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో చర్చించి పరిష్కారం చూపుతారని తెలిపారు. కావున ఘంటసాల మండల ప్రజలు ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ కోరారు.
