ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు..

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : తెలుగుజాతి ఖ్యాతిని దేశానికి చాటిచెప్పిన మహనీయుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని పలువురు వక్తలు కొనియాడారు.
అవనిగడ్డలోని ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు కార్యాలయంలో గురువారం ఉదయం ఎన్టీఆర్ 103వ జయంతిని విక్కుర్తి రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విక్కుర్తి రాంబాబు, న్యాయవాది విక్కుర్తి రామకృష్ణ లతో పాటు పలువురు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేకును రాంబాబు కట్ చేసి అందరికీ తినిపించారు.
ఈ కార్యక్రమంలో దుడ్డు మురళి,సనక బాలకృష్ణ ,బర్మా శ్రీను,అన్నపరెడ్డి లక్ష్మీ నారాయణ, కోలా సుబ్బారావు, పిరాటి రాంబాబు,రేపల్లె ప్రతాప్,బొప్పన బోస్ మాస్టర్, రేపల్లె ముసలయ్య, భూపతి నాంచారయ్య, రేపల్లె ఈశ్వరరావు,బర్మా బుజ్జి,యాలవర్తి నవీన్, గరికిపాటి శ్యామ్,ఆంజనేయులు లతో పాటు విఎస్ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
