వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
కేసముద్రం, ఆంధ్రప్రభ: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అమీనాపురంలో వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత వేంకటేశ్వర స్వామిని పలువురు ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ జ్యోతి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. వచ్చే జూలై నెలలో జరగనున్న బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆలయ కమిటీకి సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఓలం మురళి, బచ్చు పరమేశ్వర్, కోయగూరి యాకుబ్‌రెడ్డి, ఆలయ కమిటీ ధర్మకర్తలు ఓలం రాజు, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, ఓలం కృష్ణుడు, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి మహేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, నీలం దుర్గేష్, గుగులోతు దసురు నాయక్, చిన్న వెంకన్న, కౌన్సిలర్ తరాల వీరేష్, చిలువేరు సమ్మిగౌడ్, చీకటి వెంకట రామనరసయ్య, బాణాల నాగరాజు, గుప్త వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
