బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ప్రారంభం

తొర్రూరు, ఆంధ్రప్రభ : బాటసారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు ప్రొద్దుటూరు గౌరీశంకర్ అన్నారు.

మంగళవారం స్థానిక బస్టాండ్ సెంటర్‌లో పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ ముందు శ్రీ వాసవి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సంబరపు కామర్స్ అధ్యక్షుడు మచ్చ సురేష్‌తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ అధ్యక్షుడు చలువాది సత్యనారాయణ మాట్లాడుతూ, చలివేంద్రంలో త్రాగునీటితో పాటు చల్లని మజ్జిగను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. దాతలు ప్రత్యేక రోజులను సూచించి రూ.1,015 విరాళం అందిస్తే, ఆ రోజు వారి పేర్లను బోర్డుపై ప్రదర్శిస్తామని చెప్పారు. వైశాఖ మాసంలో త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేయడం ఎంతో పుణ్యప్రదమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగేశ్వరరావు, బోనగిరి శంకర్, నాల్ల కృష్ణమూర్తి, దారం కుమారస్వామి, వాసవి క్లబ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఇమ్మడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply