WGL | పొగమంచు ప్రయాణాలు ప్రమాదకరం..
WGL | పొగమంచు ప్రయాణాలు ప్రమాదకరం..
- రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయకండి
- సురక్షిత ప్రయాణం శ్రేయస్కరం
- సేఫ్,సెక్యూర్ జర్నీ చేయండి
- వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
వరంగల్ క్రైమ్, (ఆంధ్రప్రభ) : చలికాలం ప్రారంభమై పొగమంచు కప్పేస్తోంది. మంచు దుప్పట్లుపరుచుకొంటున్న వేళ ప్రయాణాలు ప్రమాదకరంగా మారే ప్రమాదం పొంచి ఉంది. పొగ మంచు కారణంగా ఎదురెదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించే అవకాశాలు లేక రోడ్డు ప్రమాదాలు సంభవించే ప్రమాదాలు ఉన్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వాహనదారులను అలర్ట్ చేశారు.
చలి కాల వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులను హై అలర్ట్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. వీలైనంత వరకు వాహనదారులు రాత్రి, తెల్లవారు జామున ప్రయాణాలు చేయద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు సూచించారు.
ప్రజలు అత్యవసరమైతే తప్ప నైట్ అండ్ ఎర్లీ హావర్స్ టైమింగ్స్ లో ప్రయాణాలను మానుకోగలరని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయాల్లో ప్రయాణం తప్పనిసరి అయితే వాహనాల స్థితిని ముందుగానే తనిఖీ చేసుకోవంతో పాటు ముఖ్యంగా బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలన్నారు.
పోలీసు సూచనలు, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ.. వాహనదారులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చూడడమే వరంగల్ పోలీసుల ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.
