Blue-Economy-Key : బ్లూ ఎకానమీతోనే ఫ్యూచర్ Andhra Prabha Top News
Blue-Economy-Key : బ్లూ ఎకానమీతోనే ఫ్యూచర్ Andhra Prabha Top News
- ఏపీ బలం ఆక్వాకల్చర్
- కేంద్రం చేతుల్లోనే ఆక్వా అభివృద్ధి
- మెగా సీ-ఫుడ్ పార్కులకు సహకరిస్తాం
- వికసిత్ బారత్ కు… ఇదే కీలకం
- 21వ శతాబద్ధం మెదీదే
- సీ ఫుడ్ జాతీయ సదస్సులో.. ఏసీ సీఎం సీబీఎన్
( ఆంధ్రప్రభ. విశాఖపట్నం బ్యూరో)

ఏపీలో బ్లూ ఎకానమీ పెరిగితే… దేశ ప్రగతికి డోకా ఉండదని, వికసిత్ భారత్ లో బ్లూ ఎకానమీ కీలకం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో సీ-ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ,
కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కాకినాడ పోర్ట్ మోడ్రనైజేషన్ చేపడతామని ప్రకటించినందుకు సంతోషం. కేంద్ర మత్స్య శాఖకు ప్రాంతీయ కార్యాలయానికి అవసరమైన స్థలాన్ని 15 రోజుల్లో ఇస్తాం. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక వృద్ధి సాధ్యం.
నీరు ఉన్న చోట నాగరికతలు విలసిల్లుతాయి… ఏపీలో గోదావరి, కృష్ణ వంటి జీవ నదులు ఉన్నాయి. ఈ వనరులు బ్లూ ఎకానమీ అభివృద్ధికి దోహదపడతాయని సీఎం వివరించారు.
Blue-Economy-Key : భవిష్యత్ బ్లూ ఎకానమీదే.

సీ-ఫుడ్ ఉత్పత్తిలో ఏపీ రెండో అతి పెద్ద రాష్ట్రం.197 లక్షల మెట్రిక్ టన్నుల సీ-ఫుడ్ ఉత్పత్తి ఏపీలో జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగే సీ-ఫుడ్ బిజినెస్‌లో ఇండియా వాటా కేవలం 5 శాతం మాత్రమే ఉంది. ఈ రంగంలో ఇండియాకు పెద్దఎత్తున అవకాశాలు ఉన్నాయి. ఏపీలో బ్లూ ఎకానమీ పెరిగితే… దేశ ప్రగతికి దోహద పడుతుంది. భారతదేశం మొత్తం చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా 28 శాతంగా ఉంది. భారతదేశం మొత్తం రొయ్యల ఉత్పత్తిలో ఏపీ షేర్ 66 శాతం భారతదేశం మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో దాదాపు ఏపీ నుంచే 38 శాతం ఆదాయం వస్తోంది. సంవత్సరానికి రూ.28,000 కోట్లకు పైగా సముద్ర ఆహార ఎగుమతులు ఏపీ నుంచే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే, భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులు కూడా అభివృద్ధి చెందుతాయి ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణలు చేస్తే, భారతదేశ బ్లూ ఎకానమీ నిస్సందేహంగా ముందుకు సాగుతుంది. అని సీఎం విశ్లేషించారు. .
Blue-Economy-Key : మీ చేతుల్లోనే ఏపీ ఆక్వా

ఏపీలో 1,053 కిలో మీటర్ల తీర ప్రాంతం ఉంది. ఏపీకి పోర్టులు, ఎయిర్ పోర్టులు ఉన్నాయి. ఆక్వా రంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన నలుగురు కేంద్ర మంత్రులు ఈ వేదిక మీదనే ఉండడం సంతోషం. సరైన సమయంలో సరైన నేత ప్రధాని మోదీ. ఏ రంగం, ఏ ఉత్పత్తి అయినా సక్సెస్ కావాలంటే క్వాలిటీ, సస్టైనబుల్టీ, ట్రేసబులిటీ, ఇన్నోవేషన్, జీరో పొల్యూషన్ అనేది ముఖ్యం. ఆక్వా ఉత్పత్తులను మరింత పెద్ద స్థాయిలో ఎగుమతులు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సీ-ఫుడ్ ఎగుమతుల అభివృద్ధికి ప్రతీ స్టేక్ హోల్డర్ బాధ్యత తీసుకోవాలి… సహకరించాలి, అని కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కోరారు. .
Blue-Economy-Key : మెగా సీ-ఫుడ్ పార్కులకు సహకరిస్తాం

ఆక్వా రంగ అభివృద్ధికి కేంద్రం తీసుకునే చర్యలకు రాష్ట్రం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది. మెగా సీ-ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తామని ఇప్పటికే చెప్పింది. ఆంధ్రా ష్రింప్… ఇండియా సీ-ఫుడ్ అనే బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఆక్వా రంగానికి భారతదేశం లైట్ హౌస్‌లా ఉండాలి… ఆ లైట్ హౌస్‌కు ఏపీ కేంద్ర బిందువుగా వెలగాలి. ఆక్వా అభివృద్ధికి అవసరమైన ఎకో సిస్టం ఏర్పాటు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అని సీఎం అన్నారు.
Blue-Economy-Key : ఇక ఆక్వా కారిడార్ అభివృద్ధి లక్ష్యం

అమరావతి, భీమవరం, కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం, నెల్లూరు ప్రాంతాలను కలుపుతూ ఆక్వా కారిడార్ అభివృద్ధి చేస్తాం. ఈ కారిడార్లో ఆక్వా అభివృద్ధికి అవసరమైన రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్స్, టెక్నాలజీని అందుబాటులోకి తెస్తాం. అతి తక్కువ వ్యయంతో అత్యధిక ఉత్పత్తి సాధించడమే లక్ష్యం. ఆక్వా ఉత్పత్తులకు సంబంధించిన ఉప ఉత్పత్తులతో కూడా ఆర్థిక ప్రగతి సాధించవచ్చు, అని సీఎం చంద్రబాబు వివరించారు.
Blue-Economy-Key : వికసిత్ బారత్ కు… ఇదే కీలకం

వికసిత్ భారత్ లక్ష్యాలు చేరుకోవడానికి బ్లూ ఎకానమీ ఎంతో కీలకం. పాండ్ టు పోర్టు, ఫార్మర్ టు గ్లోబల్ కన్స్యూమర్, బ్లూ ఎకానమీ టు వికసిత్ భారత్ అనే విధానంతో పని చేయాలి. భారత ఆశలను… ఆశయాలను నెరవేర్చేందుకు ఏపీ బ్లూ ఎకానమీ దోహదపడుతుందని భావిస్తున్నా. ఆక్వా పరిశ్రమలో ఇన్నోవేషన్లు చేసే వారిని ఆంధ్రప్రదేశ్ ఆహ్వానిస్తోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ఏపీ పని చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడితే.. ఆ పెట్టుబడులకు ప్రోత్సాహమిచ్చి… అభివృద్ధి చేస్తాం, సీఎం సీబీఎన్ హామీ ఇచ్చారు.
Blue-Economy-Key : 21 వ శతాబ్దం మోదీదే …

ఆక్వా ఉత్పత్తులతో చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ప్రజలు ఇప్పుడు ప్రొటీన్ ఉత్పత్తులనే ఆహారంగా తీసుకుంటున్నారు. ఆక్వా ఉత్పత్తుల్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడంతోపాటు… ప్రతీ రోజూ సైకిలింగ్ చేయాలి. ఇవాళ ఈ సమావేశానికి సైకిలింగ్ చేసుకుంటూనే వచ్చాను.
సైకిలింగ్ ద్వారా ఆరోగ్యం బాగుంటుంది… ఖర్చులూ తగ్గుతాయి. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. 21వ శతాబ్దం నరేంద్ర మోదీదే… భవిష్యత్తులో భారత దేశాన్ని అగ్ర భాగంలో నిలపడానికి ప్రధాని మోదీ అద్భుతంగా పని చేస్తున్నారు. ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న మోదీని మరింత బలపర్చాల్సిన అవసరం ఉంది.
ALSO READ : Cm-Cycle-Ride : ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. Andhra Prabha Top News
