Wooden Watch | చెక్కలతో చేతి గడియారం.. పవన్ ప్రశంస
Wooden Watch | చెక్కలతో చేతి గడియారం.. పవన్ ప్రశంస
Wooden Watch | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వద్ద జరిగిన పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో కొండపల్లి హస్తకళాకారులు వేపకర్రతో (మరియు ఇతర చెక్కలతో) తయారు చేసిన వినూత్నమైన చేతి గడియారాన్ని చూసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశ్చర్యపోయారు. అంతటి అద్భుతమైన కళానైపుణ్యాన్ని ఆయన ఎంతగానో ప్రశంసించారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్‌ఫ్లై పార్క్ సమీపంలో జరిగిన 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కొండపల్లి కొయ్య బొమ్మలు, హస్తకళాకృతుల ప్రదర్శనను ఆయన శ్రద్ధగా పరిశీలించారు. ఈ ప్రదర్శనలో స్థానిక కళాకారులు కలపతో తీర్చిదిద్దిన వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు మరియు వంటగది సామాగ్రిని చూసి ఆయన ఫిదా అయ్యారు. ‘వావ్… ఎంత అద్భుతం’ అంటూ కళాకారుల ప్రతిభను మనస్పూర్తిగా కొనియాడారు.
