అందరూ మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి
అందరూ మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి
- అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.అఖిల
భూపాలపల్లి, ఆంధ్రప్రభ : పర్యావరణాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అని అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.అఖిల అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అతిధిగా హాజరైన జడ్జి మాట్లాడుతూ ప్రతీ వ్యక్తి తమ తమ పుట్టినరోజు సందర్బంగా ఒక మొక్కను నాటాలని వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూనూరు సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సృజన కుమారి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పి. శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కంప అక్షయ, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.
