అగ్నివీర్‌గా ఎంపికైన తోకల్వార్ మల్కాభోయికి ఘన సన్మానం

డోంగ్లి, ఆంధ్రప్రభ : నిన్న వెలువడిన అగ్నివీర్ నియామక ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన తోకల్వార్ మల్కాభోయి విజయవంతంగా ఎంపికై మండలానికి గర్వకారణంగా నిలిచారు.

ఈ శుభ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన యువకులు మల్కాభోయిని ఘనంగా సన్మానించారు. శాలువాతో సత్కరించి, స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. దేశ సేవలో పాల్గొనేందుకు అవకాశం లభించడం పట్ల మల్కాభోయి హర్షం వ్యక్తం చేశారు.

అగ్నివీర్ పథకం ద్వారా సైన్యంలో సేవ చేసే అవకాశం యువతకు దక్కుతోందని, తాను సాధించిన ఈ విజయం మండలంలోని ఇతర యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన అన్నారు.

దేశ రక్షణలో భాగస్వామ్యం కానున్న మల్కాభోయికి మండల ప్రజలు, యువకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బస్వరాజ్, శుభం, దీపక్, సచిన్, రాజు, శివ, యోగేష్, రవి తదితర యువకులు పాల్గొన్నారు.