జనగణన సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

జనగణన సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ దుమాల మమత (రాజు) ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం కూలీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎస్ఐఆర్ కుటుంబ సర్వేతో పాటు దేశవ్యాప్త జనగణన సర్వే ప్రాధాన్యతపై ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం సరైన వివరాలు అందించాలని, సర్వే కోసం గ్రామాలకు వచ్చే అధికారులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఈ సర్వేలు కీలకమని అధికారులు వివరించారు. సమావేశంలో గ్రామ పాలకవర్గం సభ్యులు పంచాయతీ సెక్రెటరీ ప్రదీప్,గ్రామ ప్రజలు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply