రామదండు ఆధ్వర్యంలో మైక్ సెట్ ఏర్పాటు..

బిక్కనూరు, ఆంధ్రప్రభ ; మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద శ్రీరామ దండు ఆధ్వర్యంలో శనివారం మైక్ సెట్ ఏర్పాటు చేశారు. హిందువుల ఐక్యతను చాటి చెప్పేందుకు ప్రతిరోజు పలు భక్తి గీతాలు ప్రతి ఒక్కరు వినాలన్న ఉద్దేశంతో దాతల సహకారంతో మైక్ సెట్ ను ఏర్పాటు చేశారు.
మండల కేంద్రంలో రామదండు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా స్థానిక మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నాలుగు మైకులను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా శ్రీరామ దండు సభ్యులను పట్టణ ప్రజలు అభినందించారు. హిందువులందరూ ఐక్యతతో సమాజంలో ముందుకు పోవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. జైశ్రీరామ్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
