సాన్వీరెడ్డిని అభినందించిన సీఎం, డిప్యూటీ సీఎం

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ ; సీబీఎస్సీ పదో తరగతి పలితాల్లో స్టేట్ టాపర్ గా నిలిచిన బీరవోలు సాన్విరెడ్డిని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అభినందించారు. నేరేడుచర్ల పట్టణానికి చెందిన కట్టా వెంకటరెడ్డి విజయలక్ష్మి మనవరాలు బీరవోలు సాన్విరెడ్డి సీబీఎస్సీ పదో తరగతి ఫలితాల్లో స్టేట్ టాపర్గా నిలవడంతో శుక్రవారం హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి, ఆర్ధిక మంత్రి బట్టి విక్రమార్కులు శాన్విరెడ్డిని శాలువతో సత్కరించి అభినందించారు. రానున్న రోజులో మరిన్ని విజయాలు సాధించాలని చిన్నారిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, ఉమ్మడి జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ బీరవోలు సోమిరెడ్డి, విద్యార్థి తల్లిదండ్రులు బీరవోలు విక్రమ్ రెడ్డిలు ఉన్నారు.