2వ వార్డులో సమస్యలపై మున్సిపల్ చైర్మన్ సమీక్ష

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు సోమరాజుగూడెం, బుడిగే జంగాల కాలనీలను శనివారం మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను పరిశీలించి, వాటిపై సమగ్ర నివేదిక రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించిన చైర్మన్, మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్ కె. శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు వానరాశి మరియమ్మ మార్క్, పస్తం అంజనేయులు, జూకంటి సంపత్, వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
