కేటీఆర్ కంట‌త‌డి..

  • ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి కేటీఆర్ నివాళి
  • పూలమాల వేసి, గులాబీ జెండాతో అంతిమ వీడ్కోలు
  • కన్నీటి పర్యంతమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి, బీఆర్ఎస్ పార్టీ జెండాను కప్పి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని పార్టీ నాయకులు కొనియాడారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉద్యమ నాయకుడికి తుది వీడ్కోలు పలికారు.