Chityala | అన్ని విధాలుగా సహకారాలు అందిస్తా
Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ పరిధిలో గల శివనేని గూడెం లో కాంగ్రెస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి జిట్ట నగేష్ ను కౌన్సిలర్ గా గెలిపించాలని, నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఎమ్మెల్యే మున్సిపల్ పరిధిలోని ఒకటవ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలపై మంచి అవగాహన ఉన్న జిట్ట నగేష్ కు ప్రజలు అత్యధిక ఓట్లు వేసి గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి జిట్ట నగేష్, గోండ్ర మహేందర్ రెడ్డి, దేవనాక పెద్దయ్య, రుద్రవరం మల్లేష్, లింగస్వామి, నూతి సైదులు, గాదె గీత రాములు, బొబ్బలి సుధాకర్ రెడ్డి, చొప్పరి మల్లేశం, అర్జున్, శీల రాజయ్య, జిట్ట సరోజ, సుగుణమ్మ తదితరు పాల్గొన్నారు.
