అటవీ భూమిని ఆక్రమించిన గిరిజనుడి అరెస్టు..
అటవీ భూమిని ఆక్రమించిన గిరిజనుడి అరెస్టు..
- 14 రోజులు రిమాండ్ విధించిన జడ్జి..
- ఆదిలాబాద్ జైలుకు తరలింపు..
జన్నారం, ఆంధ్రప్రభ : రిజర్వ్ ఫారెస్ట్ లోని అటవీ భూమిని ఆక్రమించుకొన్న ఓ గిరిజనున్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించగా,అటవీ అధికార్లు ఆదిలాబాద్ జైలుకు తరలించారు.కవ్వాల టైగర్ రిజర్వ్ లోని జన్నారం రిజర్వ్ ఫారెస్ట్ బీటులోని గడ్డంగూడలో అటవీ భూమిని ఆక్రమించిన కేసులలో భూక్య బలిరాంనాయక్ ను అరెస్ట్ చేసి మంచిర్యాల కోర్టులో హాజరు పరచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారని జన్నారం ఫారెస్ట్ రేంజు ఆఫీసర్ కె.లక్ష్మీనారాయణ శనివారం ఉదయం తెలిపారు.
దీంతో ఆ నిందితున్ని ఆదిలాబాద్ జైలుకు తరలించినట్లు ఆయన చెప్పారు.ఆ నిందితున్ని న్యాయమూర్తి గత అక్టోబర్ లో ఇచ్చిన ఉత్తర్వులు మేరకు శుక్రవారం తమ ఫారెస్ట్ సెక్షన్,బీట్ ఆఫీసర్లు కృష్ణారావు,రవినాయక్,బేస్ క్యాంపు ఉద్యోగి అదుపులోకి తీసుకొని మంచిర్యాల కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు.అటవీ సంపదను నాశనం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
