Instagram | వినతిపత్రం అవసరం కాకుండా..! ఇన్ స్టాగ్రామ్ వేదికగా

Instagram | వినతిపత్రం అవసరం కాకుండా..! ఇన్ స్టాగ్రామ్ వేదికగా
Instagram | సమస్యను తెలుపుతున్న పలువురు…
అంబుగాంకు నరకం రోడ్డు
సమస్య నేపథ్యం
సోషల్ మీడియా పోరాటం
గ్రామస్థుల ఆవేదన – విద్యార్థుల కష్టం
అంబులెన్స్ ఘటనతో మరింత చర్చ
Instagram | కుంటాల, ఆంధ్రప్రభ : ఒకప్పుడు గ్రామ సమస్యలను వినతి పత్రం ద్వారా అధికారులకు,నాయకులకు తెలిపేవారు.ప్రస్తుత డిజిటల్ కాలంలో సోషల్ మీడియా వేదికగా తమ గ్రామ సమస్యలను ఇన్స్టాగ్రామ్ లో తెలిపి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ముధోల్ తాలూకాలోని ఓ గ్రామస్తులు. వివరాల్లోకెళ్తే…కుంటాల మండలం అంబుగావ్ గ్రామానికి గత కొంత కాలంగా రోడ్డు సౌకర్యం లేకపోవడంతో, గ్రామస్తులు పడుతున్న కష్టాలను ఇన్స్టాగ్రామ్ వ్యూవర్స్ అధికంగా ఉన్న అదే గ్రామానికి చెందినటువంటి పలువురు సమస్యపై రీల్స్ వీడియో చేసి షేర్ చేస్తున్నారు.రెండున్నర సంవత్సరాల క్రితo ఎన్నికల హామీల్లో ఎమ్మెల్యే గా గెలవగానే తమ గ్రామానికి రోడ్డు వేయిస్తానని నాయకులు తెలిపరoటూ,ఇప్పటికి రోడ్డు సరిగ్గా లేకపోవడంతో పాఠశాలలకు సైతం పిల్లలు లేటుగా వెళ్లాల్సి వస్తుందని, చదువుకుంటేనే కదా నేటి బాలలు రేపటి పౌరులు అయ్యేది అంటూ..!ఇటీవల తమ గ్రామంలో మొట్టమొదటిసారిగా అంబులెన్స్ వచ్చిందని, వచ్చిన అంబులెన్స్ ఎలా వెళ్తుందోనని,గ్రామస్తులంతా అంబులెన్స్ ని చూస్తూ ఉండిపోయారంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

ఇలా నాయకులకు,అధికారులకు తమ గ్రామ రోడ్డు సమస్యలు తెలిసే విధంగా రిల్స్ పోస్ట్ చేయగా…ఇది గమనించిన పలువురు వినతి పత్రాలు లేకుండా తమ గ్రామ సమస్యలను సోషల్ మీడియా వేదికగా అధికారులకు, నాయకులకు చేరవేయడం డిఫరెంటే అంటున్నారు.
