మక్కల కొనుగోలు , దిగుమతులు, వెంటనే చేపట్టాలి..
మక్కల కొనుగోలు , దిగుమతులు, వెంటనే చేపట్టాలి..
చిట్యాల, ఆంధ్రప్రభ : వేసవిలో రైతులు పండించిన మొక్కజొన్నలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి, దిగుమతి చేసుకోవాలని,సిపిఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ కోరారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంజనేయ కాటన్ మిల్లులో మక్కలు దిగుమతి కాక వాహనాల యజమానులు, రైతులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒక ట్రాక్టర్ లోడ్ అన్లోడ్ చేస్తే ఒక బస్తాకు రూ 30 తీసుకుంటున్నారని తరుగు హమాలి ఖర్చు పేరుతో సంబంధిత కొనుగోలుదారు డబ్బులుదోచుకుంటున్నారన్నారు. టాక్టర్స్ లారీలు వచ్చి వారం రోజులు అవుతున్న అన్ లోడ్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఎర్ర టెండలో రాత్రనకా పగలనకా ఉంటు రైతులు, డ్రైవర్లు పడిగాపులు కాస్తూ ఉపవాసం ఉంటున్న వారికి తిండి దొరకక నానా ఇబ్బందులు పడుతున్న రన్నారు. కనీసం మంచినీళ్ల సౌకర్యం లేదన్నారు . ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి తక్షణమే , నిర్లక్ష్యం అధికారులపై చర్యలు తీసుకొని , మక్క రైతులను ఆదుకోవాలని మల్లేష్ డిమాండ్ చేశారు .
