రేవంత్ ని విమర్శించే స్థాయికి కేటీఆర్ ఎదగలేదు

రేవంత్ ని విమర్శించే స్థాయికి కేటీఆర్ ఎదగలేదు

ఆలేరు, ఆంధ్రప్రభ: నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని ఏక పదజాలంతో మాట్లాడుతూ కేటీఆర్ అవమానించడం అవివేకమైన చర్య అని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం ఏ ఎజాస్ శనివారం చెప్పారు. సీఎం స్థాయిని కూడా గౌరవించకుండా నిందారోపణలతో విమర్శకు దిగడం రాజకీయ దిగజారుడు తనమే అవుతుందని ఆయన తెలిపారు. ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సలహాలు ఇవ్వకుండా రాజకీయ దురుద్దేశంతో కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరుకు ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు. ప్రజల్లో పూర్తిగా కనుమరుగైపోతున్నామన్న భయంతో కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.