ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత వైఎస్ఆర్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ, వివిధ సంఘాల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు.
వైఎస్సార్ పాలన స్వర్ణయుగం..
లక్కారంలోని ఎమ్మెల్యే వ్యక్తిగత క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన రాష్ట్ర చరిత్రలోనే ఒక స్వర్ణయుగమని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్‌మెంట్, ఇళ్ల స్థలాల పంపిణీ వంటి విప్లవాత్మక సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, చౌటుప్పల్ పురపాలక చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మునుగోడు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పబ్బురాజు గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, సింగిల్ విండో వైస్ ఛైర్మన్ చెన్నగొని అంజయ్య, మాజీ మున్సిపాలిటీ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, కౌన్సిలర్లు బద్రి గాలయ్య, కోసనం రాకేష్ రెడ్డి, పాక చిరంజీవి, పిల్లలమర్రి మధుసూదన్, బత్తుల వాణి విప్లవ్ దేప రమ్య రాజు, సర్పంచులు భీమిడి ప్రదీప్ జీ, గంజి వనజ కృష్ణ, రిక్కల మహేందర్ రెడ్డి, జువ్వి నరసింహ, పులనగారి అశ్విన్, మర్రి వంశీధర్ రెడ్డి, గంగాపురం వసంత నగేష్, కరంటోతు రాజు, సాతీరి శ్రీధర్ బాబు, కో-ఆప్షన్ మెంబర్లు బాబా షరీఫ్, హస్తం గంగారాం, ఎస్ కే జానీ బాబు, ఎండీ గౌస్ ఖాన్, దేవాలయాల చైర్మన్లు బొబ్బిల్ల మురళి, కంచర్ల అశ్విన్ రెడ్డి, దేప శ్యామ్ సుందర్, మండల, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయ దేవేందర్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాచకొండ భార్గవ్, నాయకులు ఉప్పు భద్రయ్య, తూర్పునూరి నరసింహ, షేక్ కరీం, ఈడుదుల మస్తాన్ బాబు, భత్తుల శ్రీహరి, కంది భూపాల్ రెడ్డి, నీలు నాయక్, సామకూర యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ స్మారక భవనంలో నివాళులు
చౌటుప్పల్‌లోని రాజీవ్ స్మారక భవనంలో రాజీవ్ స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఎండి ఖయ్యూం వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ రామచందర్, నాయకులు నల్ల నరసింహ, సుర్వి నరసింహ గౌడ్, ఆవుల యేసు యాదవ్, కచ్చర్ల జగ్గయ్య, మాదాని గోపాల్, ఎండి అజాజ్, చాంద్ పాషా, ముత్యాల గణేష్ కుమార్, సుర్కంటి భగవత్ రెడ్డి, నిమ్మల ప్రభాకర్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

