17yrs-old girl | కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు!
17yrs-old girl | కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు!
17yrs-old girl | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైనట్లు సమాచారం వెలుగులోకి రావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. 17 ఏళ్ల బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
బాలికకు బలవంతంగా మద్యం తాగించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని మొయినాబాద్ ఫామ్‌హౌస్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
ఈ ఘటనల కారణంగా బాలిక రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చివరకు శుక్రవారం అర్ధరాత్రి పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
మొదట కేసు నమోదు చేయడంపై పోలీసులు నిరాకరించారని, దీంతో గంటల తరబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. అనంతరం బాధితురాలి ఫిర్యాదు స్వీకరించి పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం. అధికారికంగా పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
