సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించిన ఎంఈఓ

గరిడేపల్లి, ఆంధ్రప్రభ ; మండలంలోని గడ్డిపల్లి లో ఉన్న బాలుర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని సోమవారం మండల విద్యాధికారి పానుగోతు చత్రు నాయక్ పరిశీలించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆయన వసతిగృహాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. వసతి గృహంలోని మౌలిక సదుపాయాలను, హైజీన్, కిచెన్ రూమ్, టాయిలెట్లను, విద్యార్థుల హాజరును, సిబ్బంది హాజరు రిజిస్టర్ వివరాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ వరప్రసాద్, సిఆర్పి రాతికింది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.