జనాభా లెక్కలు షురూ..!

జనాభా లెక్కలు షురూ..!
- సెన్సెస్ పోర్టల్ ద్వారా సెల్ఫ్ ఎన్యుమరేషన్..!
- తొలి విడత మే 10 వరకు ఇండ్ల జాబితా.. హౌస్ హోల్డ్ సర్వే…!
- సెన్సెస్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.. కలెక్టర్ రాజర్షి షా..!
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ లక్ష్యంగా ఆదివారం నుండి తొలివిడతగా జనాభా గణన ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం నుండి మే 10 వరకు తొలివిడతగా ఇండ్ల జాబితా, నివాస గృహాల గణన సర్వే చేపట్టి వివరాలను నమోదు చేయనున్నారు. ఆ తర్వాత రెండో దశలో మే 11 నుండి జూన్ 9 వరకు ఇనుమరేటర్లు ఇంటింటికి వెళ్లి జనాభా గణన ఉద్యమంలో పాలుపంచుకోనున్నారు.
సెల్ఫ్ ఎనిమరేషన్ సేవలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. జనాభా గణన మహా ఉద్యమంలో ప్రతి పౌరుడు తెలుగు లేదా ఇంగ్లీష్ భాషల్లో వివరాలు నమోదు చేసుకునేలా కసరత్తు పూర్తి చేశారు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులు సెల్ఫీ మోరేషన్ ప్రక్రియలో తమ వివరాలు నమోదు చేసుకున్నారు.
జనగణన.. మన అభివృద్ధి..!

దేశ అభివృద్ధిలో కీలక మైలు రాయిగా జనాభా గణన ప్రక్రియ నిలిచిపోతుందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. ఆదివారం మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. వికసిత్ భారత్ – 2047లక్ష్యంగా జనాభా గణన కార్యక్రమం వెనుకబడిన అదిలాబాద్ జిల్లాలో మహా ఉద్యమంలో సాగుతుందని తెలిపారు. ఈరోజు ఉదయం మండే ఇన్వర్టర్లు మండుటెండల్లో నివాస గృహాల గణనకు క్షేత్రస్థాయికి వెళ్లారన్నారు.
“జనగణన మన అభివృద్ధి” అనే ప్రధాన నినాదంతో ఆదిలాబాద్, ఉట్నూరు, బోత్, మారుమూల గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించామని తెలిపారు. ప్రజలు అందించే వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ సమాచారాన్ని ఇతర ప్రయోజనాలకు వినియోగించడం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ యంత్రాంగం జనాభా గణన కు పూర్తిగా సహకరిస్తుందని ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, చిత్రు, మున్సిపల్ కమిషనర్ రాజు, సెన్సస్ విభాగం అధికారులు కృష్ణయ్య, నలందప్రియ, సమాచార శాఖ అధికారి విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
