విద్యార్థుల ఉన్నత శిఖరాలకు అండగా…
విద్యార్థుల ఉన్నత శిఖరాలకు అండగా…
ర్యాంకులు సాధించటం అభినందనీయం
స్టేట్ ర్యాంకు సాధించిన అనూష కు నగదు బహుమతి…
ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి అండగా వాగ్దేవి కళాశాల నిలుస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. ఇంటర్ ఫలితాలలో సిఇసి గ్రూపులో స్టేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థిని అనుష్కకు పదివేల రూపాయల నగదు బహుమతిని అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ విద్యార్థుల కు ప్రత్యేకంగా ర్యాంకులు సాధించేలా విద్యార్థులకు విద్యను అందిస్తున్న వాగ్దేవి జూనియర్ కళాశాల యాజమాన్యం అధ్యాపకులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇంటర్ ఫలితాలలో సీఈసీ గ్రూపులో స్టేట్ ర్యాంకు సాధించిన అనుష్కను అభినందించి ఆత్మీయ సన్మానం నిర్వహించారు. వాగ్దేవి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బుస్సా సురేష్, కరస్పాండెంట్ సరిత ల ఆధ్వర్యంలో ఇంటర్ ఫలితాలలో ర్యాంకులు సాధించిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థిని అనుష్క జూనియర్ ఇంటర్ ఫలితాలలో సి ఈ సి గ్రూపులో 494 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించినట్లు తెలిపారు.
జగ్గయ్యపేట చరిత్రలో స్టేట్ ర్యాంకు మొట్టమొదటిగా సాధించటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు బొగ్గవరపు రాజా జగ్గయ్యపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కర్త వెంకట నరసింహారావు కృష్ణ ఫార్మర్స్ సొసైటీ చైర్మన్ యానాల గోపీచంద్ స్థానికులు పాల్గొన్నారు.
