వాల్ పోస్టర్లను ఆవిష్కరణ….
తొర్రూరు, ఆంధ్రప్రభ : ఈనెల 23న హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగే శ్రీ శ్రీ శ్రీ సగర భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని సగర ఉపర సంఘం జిల్లా అధ్యక్షుడు దుంపల సమ్మయ్య సగర పిలుపునిచ్చారు. సోమవారం డివిజన్ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సమయం మాట్లాడుతూ.. సగరులు నివాసం ఉండే ప్రతి గ్రామంలో భగీరథ జయంతి ఉత్సవాలు చేయాలనే లక్ష్యంతో ఈ సంవత్సరం ప్రతి గ్రామానికి భగీరథ మహర్షి చిత్రపటంతో పాటు ఇతర సామాగ్రిని అందజేయడం జరుగుతుందని, కావున గ్రామ, మండల,జిల్లా సంఘాలు ఎక్కడికక్కడ జయంతి ఉత్సవాలను 23వ తేదీన ఉదయం జరుపుకొని మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సగర ఉపర సంఘం యూత్ జిల్లా అధ్యక్షుడు సోమ రాజశేఖర్ సగర, సంఘం సంయుక్త కార్యదర్శి సోమ హరిప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మార్క రుద్రయ్య, జిల్లా కార్యదర్శి బైన బిక్షపతి, జిల్లా నాయకులు మార్క అరుణ్ కుమార్ సగర, బైన అనిల్, తొర్రూరు,పెద్దవంగర మండల అధ్యక్షులు బైన రమేష్ సగర, దుంపల వేణు సాగర్ సగర, నాయకులు సోమ మల్లేశం, మురళి, రమేష్, శీను, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
