గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
బాసర (నిర్మల్ జిల్లా) : బాసర గోదావరి నది బ్రిడ్జి కింద శుక్రవారం వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ కిరణ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు బ్రిడ్జి కింద గోదావరి నదిలో తెలియాడుతున్న మృతదేహం ఉన్నదన్న సమాచారం మేరకు గజా ఈత గల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీయగా మృతుడి వయస్సు 45 నుండి 50 వరకు ఉంటుందని, మృతుడు తెల్లని గీతలున్న చొక్కా బ్లూ కలర్ ప్యాంటు చేతికి వాచీ ధరించి ఉన్నట్లు తెలిపారు. నది ఒడ్డు పైన బ్యాగు అందులో రే డియో లభ్యమైనట్లు పేర్కొన్నారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని హృదయం ఆచూకీ తెలిస్తే బాసర పోలీస్ స్టేషన్ సంప్రదించాలని సిఐ కిరణ్ కుమార్ కోరారు.
