ప్రజల వద్దకు పాలన…

ప్రజల వద్దకు పాలన..

తీసుకు వచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదే
అభివృద్ధి సంక్షేమ పాలన దేశంలో రాష్ట్రం ఆదర్శం
సీఎం ముందు చూపుతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి
ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : అభివృద్ధి సంక్షేమ పాలనలో రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. సోమవారం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే తాతయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని బంగారు కోట్ల సెంటర్ లోని వినాయకుడి గుడిలో ఎమ్మెల్యే తాతయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ర్యాలీగా చిన్న సెంటర్ పెద్ద సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ వరకు నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ లో మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్యే తాతయ్య ఆధ్వర్యంలో బాటసారులకు పాదచారులకు చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నారా భువనేశ్వరి రాష్ట్రంలో 269 అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం 76 లక్షల రూపాయల చెక్కును అందించడం సంతోషదాయకమన్నారు.

అన్నా క్యాంటీన్లో పేద మధ్యతరగతి కార్మికులకు వేడి వేడి ఆహార పదార్థాలను రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే అమలు చేయటం అందరికీ తెలిసిన విషయమే అన్నారు. రాష్ట్రంలో అన్నదాతలకు పేదలకు కార్మికులకు కర్షకులకు అన్ని వర్గాల వారి అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఐదు దశాబ్దాలుగా ప్రజాసేవలో అపూర్వమైన రీతిలో ప్రజా పాలన అందిస్తూ ముందుచూపుతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సంక్షేమ పాలన అందిస్తున్నట్లు వివరించారు.

జన్మభూమి, డయల్ యువర్ సీఎం, విద్యుత్ , డ్వాక్రా మహిళలకు అండగా నిలవడం విదేశీ విద్య, సాగునీరు అందించే ప్రాజెక్టులు రూపకల్పన నిర్మాణం తదితర అభివృద్ధి తదితర గ్రీన్ ఎనర్జీ అంటూ భవిష్యత్తు ప్రణాళికలపై విశేష కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు నెట్టెం శివరాం తెలుగు నాడు అంగన్వాడి డ్వాక్రా సాధికార సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, పట్టణ, గ్రామం, మండల నియోజకవర్గ జిల్లా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.