మోటార్ ఆన్ చేయబోయి..
మోటార్ ఆన్ చేయబోయి..
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
కంచికచర్ల, ఆంధ్రప్రభ : మోటార్ ఆన్ చేయబోయి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై ఒక మహిళ మృతి చెందిన సంఘటన కంచికచర్ల మండలం కీసర గ్రామంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం కీసర గ్రామంకు చెందిన గంగూరి కృష్ణకుమారి (50) శనివారం ఉదయం 11:30 గంటల సమయంలో ఆమె నివాసంలో నీళ్లు పట్టుకుందామని మోటార్ ఆన్ చేసింది.
ఈ ప్రాంతంలో శనివారం ఉదయం కురిసిన వర్షానికి మోటారు తడిచి ఉండటంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని ధ్రువీకరించారు. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కంచికచర్ల పోలీసులు తెలిపారు.
