తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రమశక్తి అవార్డు ప్రదానం

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రమశక్తి అవార్డు ప్రదానం

విజయవాడ సెంట్రల్, ఆంధ్రప్రభ : వివిధ రంగాలను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించిన పలువురును ప్రభుత్వం శ్రమశక్తి అవార్డుతో సన్మానించింది.

ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వర రావు ఆదేశాలతో బుధవారం విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రమశక్తి అవార్డును రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ లక్ష్మిషా నుంచి అవార్డును అందుకున్నట్లు టి.ఎన్.టి.యు.సి ఎన్టీఆర్ జిల్లా సెంట్రల్ అధ్యక్షుడు గరిమెళ్ళ చిన్నా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బొక్వా చైర్మన్ గొట్టుముక్కల రఘు తదితరులు పాల్గొన్నారు.