బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సింహాద్రి..

బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సింహాద్రి..

అవనిగడ్డ – ఆంధ్రప్రభ : నాగాయలంక సాయిబాబా గుడి దగ్గర ప్రమాదవశాత్తు కూలీల ఆటో బోల్తా పడి పలువురికి గాయాలు కాగా వారిని హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు విషయం తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి డాక్టర్ తో మాట్లాడి ప్రమాదంలో గాయాలు తీవ్రత అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.

తదుపరి ప్రమాదంలో విషమంగా ఉన్న వారిని మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. పరామర్శించిన వారిలో అవనిగడ్డ జడ్పిటిసి చింతలపూడి లక్ష్మీనారాయణ(లచ్చి), వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నలకుర్తి రమేష్, అవనిగడ్డ మాజీ సర్పంచ్ నలకుర్తి పృథ్వీరాజ్, వైసిపి బీసీ నాయకులు జంపాన మురళి, నలకుర్తి వెంకటేశ్వరరావు, మట్ట దయానంద్, కొల్లూరి మోహన్, లంకేశ్వరరావు ఉన్నారు.

Leave a Reply