Kalvakuntla Kavitha | మహిళా బిల్లుపై కవిత తీవ్ర వ్యాఖ్యలు

Kalvakuntla Kavitha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ బిల్లుతో అనుసంధానం చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయడం పెద్ద కుట్ర అని ఆరోపించారు.
మహిళల భుజాలపై తుపాకీ పెట్టి ఈ బిల్లును కాల్చే ప్రయత్నం జరుగుతోందని ఆమె విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి రాజకీయ ప్రాధాన్యం తగ్గించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా సహించబోమని హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ సబ్ కోటా తప్పనిసరిగా ఉండాలని కవిత డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
