జాతీయ మహిళా సదస్సులో పాల్గొన్న కృష్ణకుమారి

జాతీయ మహిళా సదస్సులో పాల్గొన్న కృష్ణకుమారి

ఢిల్లీలోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో సదస్సు

చల్లపల్లి – ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహిస్తున్న మహిళా జాతీయ సదస్సులో కృష్ణాజిల్లా తరపున చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచీ 13 మంది ప్రజాప్రతినిధులను, ఆరుగురు మహిళా అధికారులను సదస్సులో పాల్గొనేందుకు ఎంపికచేయగా, వారిలో కృష్ణకుమారి ఒకరు.

ఢిల్లీలోని డా. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో మహిళా ప్రజాప్రతినిధుల జాతీయ సదస్సు జరుగుతుంది. మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో పరిపాలనలో మహిళా ప్రజాప్రతినిధులు అనుభవాలను, పాలనా సామర్థ్యం, నాయకత్వం గురించి జాతీయ సదస్సులో చర్చించటం, ప్రజాప్రతినిధులు, ప్రముకులు, కేంద్రమంత్రుల ప్రసంగాలతో పాటు మినిట్ టు మినిట్ కార్యక్రమాలు జాతీయ సదస్సులో జరుగనున్నాయి.

Leave a Reply