దుర్గమ్మ భక్తులకు వేడిలో ఊరటనిచ్చే సేవ..!

దుర్గమ్మ భక్తులకు వేడిలో ఊరటనిచ్చే సేవ..!

ఏడో రోజుకు చేరిన ప్రత్యేక కార్యక్రమం

భవానిపురం, ఆంధ్ర‌ప్రభ : విజయవాడ కనకదుర్గ ఆలయ పరిసరాల్లో దుర్గమ్మ భక్తులకు జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమం శనివారంతో ఏడవ రోజుకు చేరుకుంది.

ప్రతిరోజు సుమారు 5,000 మందికి పైగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేస్తుండటంతో ఈ సేవా కార్యక్రమానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

శనివారం ఈ కార్యక్రమాన్ని ఆప్కో మాజీ చైర్మన్, జనసేన పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ స్టేట్ కమిటీ సభ్యులు గంజి చిరంజీవి, మహిళా నేత తిరుపతి అనూష ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండుటెండల్లో భక్తులకు మజ్జిగ పంపిణీ చేయడం ద్వారా బాడిత శంకర్ సేవాభావాన్ని చాటుతున్నారని ప్రశంసించారు. పదవులు కాదు, సేవే ముఖ్యం అనే పవన్ కళ్యాణ్ ఆలోచనకు అనుగుణంగా కార్యకర్తలు ముందుకు సాగడం అభినందనీయమని పేర్కొన్నారు.

జనసేన మంగళగిరి నేత జొన్న రాజేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో, జిల్లా నాయకత్వం మార్గదర్శకంలో ఈ సేవా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. వేసవికాలం మొత్తం భక్తులకు మజ్జిగ పంపిణీ కొనసాగుతుందని ఆయన చెప్పారు.

జనసేన నాయకులు చెవ్వాకుల కోటేష్ బాబు, సామల నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్యకర్తల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.


Leave a Reply