Nila Robot : పుదుచ్చేరిలో రోబో సందడి Andhra Prabha News

Nila Robot : పుదుచ్చేరిలో రోబో సందడి Andhra Prabha News
- ఓటర్లకు ‘నీలా’స్వాగతాంజలి
- ఈసీ వినూత్న ప్రయోగం
- పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఆకర్షణ
- ఓటర్లకు మార్గనిర్దేశం
- కోయంబత్తూరు సంస్థ సృష్టి
- పట్టణాల్లో ఓటింగ్ శాతం పెంపే లక్ష్యం
( ఆంధ్రప్రభ, పుదిచ్చేరి ప్రతినిధి)
Nila Robot : పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో ఒక రోబో సందడి అంతా ఇంతా కాదు. ఓటర్లను తెగ మురిపించేసింది. రండి రండి.. ఓటు వేయండి. మీ ఓటు మీది. దొంగ ఓటు నపై అంటూ ఓటర్లలో ఉత్సాహం నింపేందుకు ఎన్నికల అధికారులు ఈ వినూత్న ప్రయోగం చేశారు. ఇంతకీ ఈ రోబో పేరేంటంటే..’నీలా’ (Nila). పుదిచ్చేరీ సుందరి . ఈ హ్యూమనాయిడ్ నీలా చీర కట్టింది. ఓటర్లను మురిపించింది, ఆకట్టకుంది. పుదుచ్చేరిలోని వీఓసీ (VOC) ప్రభుత్వ పాఠశాలలో నీలా మిలమిల మెరిసే కళ్లతో.. తెల్లటి చీరలో ఓటర్లను ఆకట్టుకుంది. పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు చేతులు జోడించి నమస్కరిస్తూ, పువ్వులతో సాదర స్వాగతం పలుకుతోంది. ఓటర్లకు వారి బూత్ నంబర్ ఎక్కడ ఉంది? క్యూ లైన్లో ఎలా వెళ్లాలి? వంటి విషయాలపై తమిళం, ఇంగ్లీష్ భాషల్లో సూచనలు ఇస్తోంది. ఓటు వేసిన తర్వాత ఓటర్లతో కలిసి ఫోటోలు దిగుతూ సందడి చేస్తోంది.
